News April 1, 2025

పల్నాడు జిల్లాలో పన్నుల వసూళ్లు ఇలా 

image

పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లను వేగవంతం చేశాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పురపాలక సంఘంలో 54.42 శాతం, వినుకొండలో 82.22 శాతం, సత్తనపల్లిలో 58.83%, మాచర్లలో 53%, పిడుగురాళ్లలో 69%, దాచేపల్లిలో 64%, గురజాలలో 65% పన్నులు వసూలు అయ్యాయి. మార్చి నెల ముగిసిపోవడంతో పన్నులకు సంబంధించి వడ్డీ రాయితీని ప్రకటించినప్పటికీ నూటికి 100 శాతం పన్నులను చెల్లించలేదు. 

Similar News

News September 14, 2025

AP న్యూస్ రౌండప్

image

*తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు UNESCO రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు.
*జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా 60,953 కేసులు పరిష్కారం, రూ.109.99 కోట్ల పరిహారం అందజేత.
*గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు. రెండు ఘటనల్లో నలుగురు మృతి.
*రేపు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలకు విద్యాశాఖ కసరత్తు.
*స్వచ్ఛాంధ్ర పురస్కారాలు.. తొలి విడతలో 16 విభాగాలకు 52 అవార్డులు.

News September 14, 2025

MDK: రూ.1,04,88,964 రికవరీ

image

లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బులు, విలువైన సమయం ఆదా అవుతుందని, రాజీతో ఇద్దరూ గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అన్నారు. MDKలో 4,987 కేసులు, SRDలో 4,334, SDPTలో 3,787 కేసులు పరిష్కారించినట్లు వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్& డ్రైవ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, E-పిట్టీ కేసులు, తగాదాలు తదితర కేసులను రాజీ కుదిర్చామన్నారు. MDKలో రూ.1,04,88,964 రికవరీ చేశారు.

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో ఎరువుల యాజమాన్యం ఇలా..

image

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.