News February 19, 2025

పల్నాడు జిల్లాలో పోలీసుల పల్లెనిద్ర

image

పల్నాడు జిల్లాలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని సమస్యత్మక గ్రామాలలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మాచర్ల, వెల్దుర్తి, వినుకొండ మండలాల పరిధిలోని గన్నవరం, కొత్తపుల్లారెడ్డి గూడెం, క్రోసూరులతో పాటు రొంపిచర్ల మండలంలోని అన్నవరం గ్రామాల్లో సీఐలు, ఎస్ఐలు వారి సిబ్బందితో కలిసి స్థానికులతో మాట్లాడారు. ఆయా గ్రామాలలోనే వారు నిద్రించారు. 

Similar News

News November 26, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేనెల 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను SP ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు DSP శ్రావణ్ కుమార్‌తో కలిసి హెలిపాడ్ ప్రాంతం, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంతం, పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.

News November 26, 2025

తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News November 26, 2025

కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

కదిరి టౌన్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.