News December 19, 2024
పల్నాడు జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు(1/3)

పల్నాడు జిల్లాలో వరి కోతలు,నూర్పిళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం జిల్లాలో 35 వేల హెక్టార్లలో సాగు జరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లోకి రానటువంటి నాలుగైదు వేల ఎకరాల వరి పంట బావులు కిందసాగవుతోంది. అయితే కొనుగోలు కేంద్రాలు సరిపడా లేవని రైతులు, రైతు సంఘాలు అంటున్నాయి. కాగా 100కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పేర్ల నమోదుకు రైతులు ముందుకు రావాలని సివిల్ సప్లై అధికారులు కోరుతున్నారు.
Similar News
News November 7, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.
News November 7, 2025
GNT: రెండవ శనివారం సెలవుపై సడలింపు..రేపు స్కూల్స్కి హాలిడే

తుఫానుకు 4 రోజులు ఇచ్చిన సెలవులను భర్తీ చేస్తూ 2వ శనివారం కూడా స్కూల్స్ పనిచేస్తాయని చేసిన ప్రకటనను సడలించారు. గత నెల 23న అన్ని పాఠశాలలు తమ స్థానిక సెలవులలో ఒకదాన్ని వినియోగించుకోవడం వల్ల 8వ తేదీ 2వ శనివారం పని చేయవలసిన అవసరం లేదని తమకు సమాచారం వచ్చినట్లు తెనాలి ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మిగిలిన 3 సెలవులను ప్రొసీడింగ్స్లో జారీ చేసిన విధంగా వచ్చే 3 నెలల్లో 2వ శనివారాలతో భర్తీ చేసుకోవచ్చన్నారు.


