News March 26, 2025
పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు రక్షణ, ప్రశాంత వాతావరణం అందించామని వారు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి శక్తి యాప్ వంటి వాటిపై ఎస్పీ నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు.
Similar News
News February 23, 2026
ESIC చెన్నై 51 పోస్టులకు నోటిఫికేషన్

చెన్నై KK నగర్‌లోని <
News February 23, 2026
ఉల్లిలో నులి, తామర పురుగుల నివారణ ఎలా?

ఉల్లి పంటలో తెగుళ్ల నివారణకు ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయడం మంచిది. ఒకవేళ పంటలో నులి పురుగుల ఉద్ధృతి కనిపిస్తే ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయాలి. దీని వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం అవుతాయి. ఇక పంటలో తామర పురుగు నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లాలి. పంట పెరుగుదల దశలో ఈ పురుగుల నివారణకు 5% వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
News February 23, 2026
HNK: ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ డిగ్రీ ఫలితాలు విడుదల

సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సుల ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి ప్రకటించారు. ఈ పరీక్షల్లో 33.35 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆమె వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు పునఃపరిశీలన లేదా అనుబంధ పరీక్షల కోసం మార్చి 9వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


