News February 11, 2025
పల్నాడు: జిల్లాలో 128 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు

పల్నాడు జిల్లాలో 128 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ మురళి వెల్లడించారు. సోమవారం 10 తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో చంద్రకళతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీరు, వెలుతురు, బాత్రూంలు, మెడికల్ వ్యాన్లు, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులు ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ జస్వంత్ ఉన్నారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డి: ‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు’

ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా జిల్లాలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల పాల్గొన్నారు.
News September 18, 2025
SRD: భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.