News April 29, 2024
పల్నాడు జిల్లాలో 14 నామినేషన్లు ఉపసంహరణ

జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గానూ 14 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. సోమవారం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు, చిలకలూరిపేట ఒకరు, నరసరావుపేట అసెంబ్లీకి ఇద్దరు, సత్తెనపల్లి ఐదుగురు, వినుకొండ ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 30, 2025
ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 4 లక్షలకు చేరువలో ఉన్న ప్రవాహం, సాయంత్రం 4 గంటల తర్వాత 5,00,213 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ నీటిమట్టం 13.8 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


