News March 24, 2025
పల్నాడు జిల్లాలో TODAY TOP NEWS

☞ రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం
☞ పిడుగురాళ్లలో మహిళ దారుణ హత్య
☞ నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ అనిల్
☞ మాజీ మంత్రి రజినిపై ఎమ్మెల్యే పుల్లారావు ఫైర్
☞ సత్తనపల్లి: బొలెరో వాహనం బోల్తా.. 11 మంది గాయాలు
☞ మాచర్ల- బెంగళూరు బస్ సర్వీస్ రద్దు
☞ సత్తెనపల్లిలో వృద్ధుడిని ఢీకొట్టిన బస్
Similar News
News September 18, 2025
ఈసారైనా రామప్ప ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యేనా?

వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకానికి దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఛైర్మన్, ధర్మకర్తల మండలిని నియమించనున్నట్లు సమాచారం. దశాబ్దకాలంగా రామప్ప ట్రస్ట్ బోర్డు నియామకం నిలిచిపోయింది. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ట్రస్ట్ బోర్డు నియామకం ఉండదని కొంతకాలంగా ప్రచారం కొనసాగింది. ఈసారైనా ట్రస్ట్ బోర్డు నియామకం జరిగేనా? మీ కామెంట్!
News September 18, 2025
సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదిలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు వర్షపాత నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 2.3, చందుర్తి 13.8, వేములవాడ రూరల్ 22.2, బోయిన్పల్లి 14.9, వేములవాడ 16.6, సిరిసిల్ల 23.0, కొనరావుపేట 15.7, వీర్నపల్లి 11.0, ఎల్లారెడ్డిపేట 1.4, గంభీరావుపేట 26.9, ముస్తాబాద్ 5.4, తంగళ్లపల్లి 5.6, ఇల్లంతకుంటలో 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 18, 2025
మల్యాల: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని మల్యాల మండలం నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గమనించారు. శవం మరింత ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.