News February 24, 2025
పల్నాడు జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పల్నాడు జిల్లా ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగారావును వైద్య సేవల వివరాలడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రోగులను పలకరించి మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి, విజువల్ సర్టిఫికెట్లు వివరాలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్ల సమాచారం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News February 25, 2025
నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
News February 25, 2025
దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.
News February 25, 2025
BHPL: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యా, విద్యుత్, వైద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.