News March 18, 2025
పల్నాడు జిల్లా ఎస్పీ సూచనలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 74 మంది కుటుంబ,ఆర్థిక,ఆస్తి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు.
Similar News
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.
News November 22, 2025
సంగారెడ్డి జిల్లాలో ఓటర్ జాబితాపై కసరత్తు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ జాబితాను ప్రదర్శించారు. ఓటు లేని వారు మరోసారి నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే పరిశీలన చేస్తున్నారు. ఈ 23వ తేదీన ఓటర్ తుది జాబితాను ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.
News November 22, 2025
హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.


