News March 1, 2025

పల్నాడు జిల్లా టాప్ న్యూస్

image

 ★ దాచేపల్లిలో పింఛన్ డబ్బుతో సచివాలయం ఉద్యోగి పరార్ ★ నరసరావుపేట: సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్★ సత్తెనపల్లిలో పరీక్షా కేంద్రం మార్పుపై ఇంటర్ విద్యార్థుల ఆందోళన★ చిలకలూరిపేట: బ్యాంకు కుంభకోణంలో నిందితుడి అరెస్ట్★ పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 759 మంది విద్యార్థులు గైర్హాజరు★ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్..

Similar News

News March 19, 2025

విద్యార్థులకు షాక్.. ఫీజులు భారీగా పెంపు

image

TG: పాలిటెక్నిక్ కోర్సు గరిష్ఠంగా రూ.39వేలకు పెరిగింది. దశాబ్ద కాలం నుంచి ఫీజుల పెంపు లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా రూ.40వేల వరకు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఫీజు‌ రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 చెల్లిస్తోంది. మరోవైపు నేటి నుంచి పాలిసెట్ <>అప్లికేషన్లు<<>> స్వీకరించనున్నారు. మే 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది.

News March 19, 2025

చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందారు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

News March 19, 2025

వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ చేస్తాం: అచ్చెన్న

image

అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.

error: Content is protected !!