News March 28, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు,. ☞ సత్తనపల్లి: బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక. ☞ చిలకలూరిపేట: పరీక్షా కేంద్రంలో ఉపాధ్యాయుడికి పాముకాటు. ☞ మాచర్ల: సినిమా థియేటర్లో ఆర్డీఓ తనిఖీలు. ☞ క్రోసూరు: కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ☞ దాచేపల్లి: సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాలలో అధికారుల పర్యటన.
Similar News
News April 3, 2025
గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.
News April 3, 2025
సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.
News April 3, 2025
విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.