News April 5, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. 

Similar News

News November 6, 2025

మరిపెడ: ACBకి చిక్కిన AEO

image

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

image

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.