News March 27, 2025

పల్నాడు జిల్లా నివేదికను సమర్పించిన కలెక్టర్ 

image

పల్నాడు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో నివేదికను కలెక్టర్ అరుణ్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగిన సదస్సులో జిల్లాకు సంబంధించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానం, బనకచర్లకు గోదావరి జలాల తరలింపు డిజైన్, సాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టు పరిస్థితిని తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వివరించారు. 

Similar News

News November 19, 2025

మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

image

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

News November 19, 2025

జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

image

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.

News November 19, 2025

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

image

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.