News March 12, 2025

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

image

 పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News March 24, 2025

ప.గో: EKYC ఎక్కడ చేస్తారంటే..?

image

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప.గో జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా మంది EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.

News March 24, 2025

అవిశ్వాస తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కన్నబాబు

image

విశాఖ నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి శ్రేణులు నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం విశాఖ మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమికి సంఖ్యాబలం లేకపోయినా నోటీసు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దొడ్డి దారిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

News March 24, 2025

శ్రీకాకుళం: జిల్లాలో నేడు ఈ మండలాల వారికి అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. జిల్లాలోని బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి మండలాల్లో 37 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

error: Content is protected !!