News April 19, 2024
పల్నాడు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా డేగల

పల్నాడు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా రెంటచింతల మండలానికి చెందిన డేగల మహేశ్‌ను నిమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలోని కార్యాలయంలో శుక్రవాం మహేశ్‌కు అందజేశారు. మహేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా పదవి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు నేడు పెదకాకానిలోని శంకర ఐ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పర్యటించి పరిశీలించారు. ఏర్పాట్లని పక్కాగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 8, 2025
తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


