News April 3, 2025

పల్నాడు జిల్లా TODAY TOP NEWS

image

☞ నరసరావుపేట: జిల్లా సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్న కలెక్టర్, ☞ ముప్పాళ్ల: వైసీపీ సానుభూతిపరుడిపై దాడి, ☞ రాజుపాలెం: గంజాయి అక్రమ రవాణాలో అరెస్టులు, ☞ బొల్లాపల్లి: తల్లిని హతమార్చిన తనయుడు, ☞ మాచర్ల: ఆర్టీసీ కార్మికుల ఆందోళన, ☞ నకరికల్లు: రుణ మేళాలకు 432 దరఖాస్తులు, ☞ నూజెండ్ల: బెల్టు షాపులపై కేసులు నమోదు, ☞ పెదకూరపాడు: బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ. 

Similar News

News April 18, 2025

SKZR: సమ్మర్ స్పెషల్ ట్రైన్ గడువు పొడిగింపు

image

సమ్మర్ స్పెషల్ ట్రైన్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు గడువును రైల్వే శాఖ మరో ఐదు రోజులు పొడిగించింది. స్పెషల్ ట్రైన్ ప్రస్తుత కాలపరిమితి ఈ నెల 17 వరకు ఉండగా.. 28 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాజీపేట్- బల్లార్షా సెక్షన్ పరిధిలోని కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా జంక్షన్‌లో ఈ రైలు ఆగుతుంది.

News April 18, 2025

ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

image

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.

News April 18, 2025

భూభారతి ద్వారా రైతులకు మేలు: భద్రాద్రి కలెక్టర్

image

భూభారతిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి నూతన చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!