News February 12, 2025
పల్నాడు: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

పల్నాడు జిల్లా (డివిజన్)లో 34 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్/ బైక్ నడిపే సామర్థ్యం ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News October 26, 2025
చిత్తూరు జిల్లా స్పెషల్ అధికారిగా గిరీష నియామకం

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా పీఎస్ గిరీషను నియమించింది. వర్షాల ప్రభావం తగ్గే వరకు ఆయన విధుల్లో ఉండనున్నారు. జిల్లాకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News October 26, 2025
బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.
News October 26, 2025
నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.


