News February 12, 2025

పల్నాడు: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

image

పల్నాడు జిల్లా (డివిజన్)లో 34 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్/ బైక్ నడిపే సామర్థ్యం ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News March 20, 2025

నిర్మల్: ఆ గురువులే కీచకులు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

error: Content is protected !!