News June 21, 2024

పల్నాడు: తల్లీబిడ్డా మృతి.. కారకులపై కఠిన చర్యలు

image

విజయపురిసౌత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17న పురిటి బిడ్డతోపాటు తల్లి పావని మృతి చెందిన ఘటనపై, సమగ్ర విచారణతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఆరోగ్య సేవల కో-ఆర్డినేటర్‌ (DCHS) రంగారావు తెలిపారు. విచారణ నిమిత్తం గురువారం ఆస్పత్రికి  వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తల్లీబిడ్డా మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నానన్నారు.

Similar News

News October 30, 2025

తుపాన్ సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్: కలెక్టర్

image

తుపాన్ సహాయక చర్యల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,450 మందిని పునరావస కేంద్రాలకు తరలించి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి రూ.3 వేలు, నిత్యవసర సరకులు ప్రభుత్వం అందిస్తోందని, ఈ కార్యక్రమాన్ని తెనాలి నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

image

తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా తరలివస్తుంది. గురువారం ఉదయం 11 గంటల వరకు 2,74,263 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.9 అడుగులుగా ఉంది. దీంతో అన్ని కెనాల్స్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

News October 30, 2025

GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

image

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.