News February 16, 2025

పల్నాడు: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

రాజుపాలెం (మ) నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దృశ్యాలు అక్కడి వారందరిని కలిచి వేశాయి

Similar News

News March 20, 2025

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. టాప్ సెలబ్రిటీలపై కేసు

image

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.

News March 20, 2025

BREAKING: హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి హరీశ్‌తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 20, 2025

వారం రోజుల్లో రూ.2300 పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే రూ.2300 పెరిగి శుభకార్యాల వేళ సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.90,660కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,100గా ఉంది.

error: Content is protected !!