News April 12, 2025

పల్నాడు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

image

పల్నాడు జిల్లాలో 31,672 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 18,481 మంది ఫస్టియర్‌, 13,191 మంది సెకండియర్‌ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News November 25, 2025

జన్నారం: ‘ధాన్యంలో 17% లోపు తేమ ఉండాలి’

image

17% లోపు తేమ ఉంటేనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని జన్నారం మండలం దేవునిగూడెం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. మంగళవారం క్లస్టర్ పరిధిలోని దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామ శివారులో ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో మంచి ఎక్కువగా పడుతుందని, దీంతో తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంపై కవర్లను తప్పకుండా కప్పాలని రైతులకు ఏఈఓ అక్రమ్ సూచించారు.

News November 25, 2025

GHMC కౌన్సిల్ హాల్‌లో తగ్గేదే లే!

image

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.

News November 25, 2025

ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

image

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్‌లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.