News July 7, 2024
పల్నాడు: పొలంలో పేలిన నాటు బాంబు

దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం ఉదయం నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు పొలాలకు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.