News July 12, 2024
పల్నాడు ప్రథమ కలెక్టర్ జిల్లాకు రాక

పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌గా పని చేసిన లోతేటి శివశంకర్ ఈనెల 13న నరసరావుపేట రానున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడ్డాక ఆయనను ప్రభుత్వం ప్రథమ కలెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలకు గుర్తింపుగా “లోతేటి శివశంకర్ ఐఏఎస్”అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షలు దాటిన వైద్య సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో మైలురాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 లక్షల మందికి సేవలు అందించినట్లు బుధవారం వెల్లడించారు. గత ఆరు నెలల్లోనే 5 లక్షల ఓపీ నమోదైందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
News December 10, 2025
GNT: 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు

మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్షించి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
News December 10, 2025
అమరావతిలో 30% ఎక్కువ ఆక్సిజన్!

రాజధాని అమరావతిలో పచ్చదనం అద్భుత ఫలితాలనిస్తోంది. ఇక్కడ నాటిన చెట్లు సాధారణం కంటే 30 శాతం ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తున్నాయని ఏడీసీఎల్ డైరెక్టర్ లక్ష్మీ పార్థసారథి వెల్లడించారు. పర్యావరణ హితంగా చేపట్టిన మొక్కల పెంపకం ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అందిస్తోందన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు. రాజధాని ఆక్సిజన్ హబ్‌గా కూడా మారుతోందని స్పష్టం చేశారు.


