News March 28, 2025
పల్నాడు: ఫ్యాప్టో ఛైర్మన్‌గా రామిరెడ్డి ఎన్నిక

పల్నాడు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా ఎల్వీ రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా సేవలందించడం జరుగుతుందని రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్యా బోధనతో పాటు, ఉపాధ్యాయుల సంక్షేమం కొనసాగే విధంగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తానని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News September 18, 2025
భద్రాచలం: డ్రిల్ బిట్‌ను మింగిన బాలుడు

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఎటపాక మండలం చోడవరానికి చెందిన గౌతమ్(8) ఆడుకుంటూ డ్రిల్ బిట్‌ను మింగాడు. అది పేగులో ఇరుక్కోవడంతో బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి డ్రిల్ బిట్‌ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
News September 18, 2025
TU: RSS ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

తెలంగాణ యూనివర్సిటీ RSS శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య వక్తగా డా.కాపర్తి గురుచరణం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయదశమి ఉత్సవమనేది విజయానికి ప్రతీక అన్నారు. అటు RSS 100సం.రాలలో సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఖండ సహా కర్యవహ సంతోష్, సాంగు,మధు,శ్రవణ్, దిగంబర్,రమణ తదితరులున్నారు.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?