News February 13, 2025
పల్నాడు: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం

గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.
Similar News
News March 20, 2025
KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.
News March 20, 2025
భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి.
News March 20, 2025
కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.