News March 14, 2025
పల్నాడు: మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా సాంప్రదాయ రంగులు ఉపయోగించటం ఆరోగ్యకరమని అన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వివరించారు. ప్రధాన కుడళ్లు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉంచడంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 17, 2025
సంగారెడ్డి: మొదటి సంవత్సరం పరీక్షకు 96.71% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.71% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.19,938 మంది విద్యార్థులకు గాను 19,282 మంది విద్యార్థులు హాజరయ్యారని, 656 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 17, 2025
అనంత: ప్రజల నుంచి కలెక్టర్ అర్జీల స్వీకరణ

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమస్యల అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News March 17, 2025
ఎంపీ డీకే అరుణ నివాసంలో హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడి గంటన్నర పాటు ఇంట్లో పలు గదులలో తిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీకే అరుణ భద్రత కల్పించాలని కోరారు. అందులో భాగంగా హైదరాబాద్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిర సోమవారం ఎంపీ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆగంతకుడు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డీకే అరుణను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.