News March 29, 2025

పల్నాడు: మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశం 

image

పల్నాడు జిల్లాలో మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలకు శ్రద్ధతో వైద్య పరీక్షలను అందించాలన్నారు. జిల్లాలో ఎడ్లపాడు, సిరిగిరిపాడు, ఆరేపల్లి, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాల గురించి చర్చించారు. రక్తహీనత సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందించాలని, ప్రసవ సమయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

Similar News

News April 4, 2025

రైతులకు గుడ్‌న్యూస్.. యాసంగిలోనూ బోనస్

image

TG: ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్‌లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.

News April 4, 2025

WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

image

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్),ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు పదో తరగతి, అగ్నివీర్ ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు.

News April 4, 2025

కంచరపాలెంలో వివాహిత ఆత్మహత్య

image

విశాఖలో వివాహిత దేవి గురువారం ఆత్మహత్య చేసుకుంది.  చీకటి దేవి(30)కి  8 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో కంచరపాలెంలో తన తల్లి దగ్గరే ఉండేది. ఏడాది క్రితం కలహాల కారణంగా పిల్లలను తల్లి దగ్గరే వదిలి తను వేరేగా ఉంటోంది. ఆ ప్రాంతంలోనే ఓ షాపులో పనిచేస్తూ దేవి రసాయనాలు తాగి స్పృహ కోల్పోయింది. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

error: Content is protected !!