News June 5, 2024

పల్నాడు: మామపై 21 వేల మెజారిటీతో గెలిచిన అల్లుడు

image

పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్ రావుపై ఆయన అల్లుడు భాష్యం ప్రవీణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావు అన్నయ్య కూతురిని భాష్యం ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ అవుతారు. కాగా మామ నంబూరు శంకర్ రావుపై 21,089 ఓట్ల మెజారిటీతో భాష్యం ప్రవీణ్ విజయం సాధించి సత్తా చాటాడు.

Similar News

News October 27, 2025

గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.

News October 27, 2025

సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: DEO

image

తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. ఎంఈవోలు మండల కేంద్రాల్లో ఉండి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తుపాను షెల్టర్ల ఏర్పాటు కోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సహకరించాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలోనూ 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రేణుక చెప్పారు.

News October 27, 2025

గుంటూరు: తుఫాన్ దృష్ట్యా పీజీఆర్ఎస్ రద్దు

image

‘మెంథా’ తుఫాన్ దృష్ట్యా సోమవారం గుంటూరు జీఎంసీలో నిర్వహించాల్సిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ రద్దు విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.