News March 2, 2025
పల్నాడు: యువకుడితో పరారైన వివాహిత

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన TGలోని మేడ్చల్లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడు(D) బొల్లాపల్లి(M)కి చెందిన గోపి(22)కి వరంగల్కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్పై వెళ్తుండగా భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరూ పరారయ్యారు. దీంతో భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News October 16, 2025
డోన్: కానిస్టేబులే దొంగ

డోన్ పట్టణం శ్రీరామనగర్లోని ఓ షాపులో కూర్చొన్న మహిళ మెడలోని 5 తులాల బంగారు చైన్ను మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి <<18010327>>దొంగలించడానికి <<>>ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. పోలీస్ విచారణలో నిందితుడు కానిస్టేబుల్ ఈశ్వరయ్యగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పట్టణ సీఐ ఇంతియాజ్ బాష వెల్లడించారు.
News October 16, 2025
భద్రాచలం: విద్యార్థులకు రేపటి నుంచి క్రీడా పోటీలు

భద్రాద్రి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఈ నెలలో జరిగే డివిజన స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా సంబంధిత హెచ్ఎం, వార్డెన్, పీడీ, పీఈటీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని గురువారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ గురువారం తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో ఈనెల 17,18 తేదీలలో క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
News October 16, 2025
వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు: నిర్మల్ కలెక్టర్

వర్షాకాలం నిర్మల్లో వరద నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలో వరద నీటి నియంత్రణపై సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కువగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నిల్వ ఉండకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని తెలిపారు.