News March 31, 2025
పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు.
Similar News
News November 28, 2025
HYD: అభివృద్ధికి నిదర్శనంగా ఆదిబట్ల !

ఆదిబట్ల మున్సిపాలిటీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మినీ గచ్చిబౌలిగా పేరుగాంచింది. IT సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డితో ఆదిభట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా, అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంగా ఆదిభట్లగా పేరు పొందింది.
News November 28, 2025
మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.


