News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

Similar News

News February 23, 2026

కాంట్రాక్టర్లపై కేసుల నమోదు చేయాలి: కలెక్టర్

image

పేదలకు మంజూరైన ఇళ్లపై పల్నాడు కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతిక శుక్లా సోమవారం అధికారులతో సమీక్షించారు. ఆప్షన్-3లో నిర్మాణాలు మధ్యలో వదిలిన కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలన్నారు. వారిని భవిష్యత్ కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేని స్థలాల వివరాలు అందించాలని సూచించారు. రెవెన్యూ శాఖతో సర్వే చేసి ఎన్‌ఓసీలు జారీ చేస్తామన్నారు.

News February 23, 2026

గద్వాల: 40 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

image

మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 8,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు, అత్యవసర వైద్యం కోసం ప్రాథమిక చికిత్స మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు.

News February 23, 2026

బ్రహ్మోస్ కంటే వేగంగా.. భూగర్భ బంకర్లను ఛేదించేలా..

image

భారత్‌కు గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ అందించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ కంటే ఇది ఎన్నో రెట్లు వేగవంతమైనది. 2000KM లక్ష్యాన్ని ఛేదించగల ఈ మిస్సైల్‌ను ఫైటర్‌జెట్ నుంచి కూడా ప్రయోగించొచ్చు. su-30MKIతో భారత్ వీటిని ఉపయోగించే ఛాన్స్ ఉంది. కచ్చితత్వంతో భూగర్భ బంకర్లనూ ఈ మిస్సైల్ ధ్వంసం చేయగలదు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో దీనిపై డీల్ జరిగే అవకాశం ఉంది.