News March 2, 2025

పల్నాడు: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాలోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Similar News

News December 9, 2025

చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

image

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

News December 9, 2025

ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

image

భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో 8మండలాల్లో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295మంది సిబ్బంది నియమించామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎస్ఈసీ రాణి కుముదినికి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

సిద్దిపేట: ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. గజ్వేల్, మర్కుక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌలతాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.