News February 20, 2025

పల్నాడు: రైల్వేట్రాక్‌ పై మృతదేహం కలకలం

image

బెల్లంకొండ – రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తుతెలియని మృతదేహం గుర్తించారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు క్రిందపడి బలమైన గాయాలు కలిగి అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. వయస్సు సుమారుగా 30 నుంచి 35 సంవత్సరములు కలిగి ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు చొక్కా సిమెంట్ రంగు ప్యాంట్ ధరించాడన్నారు.ఆర్పీఎఫ్ పోలీసులు చేరుకొని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News March 27, 2025

భర్త అక్రమ సంబంధాన్ని పట్టించిన భార్య (వీడియో) 

image

భర్త అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండ్‌గా పోలీసులకు భార్య పట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలిపిరి PS పరిధిలోని అక్కారం పల్లి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్యే100 కాల్ చేసి పోలీసుల సహాయంతో ఇంటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే బాధితురాలి మామ కోడలిపై కర్రతో దాడి చేశాడు. అడ్డుకున్న పోలీసులపై ఆయన దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News March 27, 2025

శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

image

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

News March 27, 2025

మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

image

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

error: Content is protected !!