News April 3, 2025
పల్నాడు: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో 2025 ఏప్రిల్ 5న జరగనున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాపడ్డాయి. 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 15న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.


