News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 23, 2025
ఇల్లందకుంట రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కార్యదర్శి సుధాకర్, ఆలయ ఛైర్మన్ రామారావు కోరారు.
News December 23, 2025
బాంబులతో చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారు.. ఇదే సాక్ష్యం: కేటీఆర్

TG: ఇసుక మాఫియా కోసం బాంబులతో చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ “చిట్టి నాయుడి” ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు’ అని Xలో ఫైరయ్యారు.
News December 23, 2025
ఆ ‘అధికారం’ ప్రజలదే.. మీరేమంటారు?

AP: అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. 30ఏళ్లు అధికారంలో ఉంటామని CMగా జగన్ పలుమార్లు చెప్పారు. కానీ 2024లో జనం ఓడించారు. 15ఏళ్లు పవర్ తమదేనని పవన్ కళ్యాణ్, లోకేశ్ ఇటీవల అంటున్నారు. YCPని శాశ్వతంగా అధికారానికి <<18642155>>దూరం<<>> చేస్తానని తాజాగా పవన్ అన్నారు. కానీ అధికారంలో ఎవరుండాలో నిర్ణయించే ‘అధికారం’ ప్రజలదే. ఎవరి గెలుపోటములైనా ఓటర్ల చేతుల్లోనే ఉంటాయి. మరి మీరేమంటారు?


