News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 20, 2025
KMR: స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి యువకుడి మృతి

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం వెళ్లిన నగేష్ అనే యువకుడు సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగేష్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.
News April 20, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

రైతుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.