News July 8, 2024
పల్నాడు: ‘విత్తనం.. క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం’

ఖరీఫ్ సీజన్ రావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా షాపుల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఎరువులు విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, విత్తన ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు.
Similar News
News December 10, 2025
క్రిస్మస్ రద్దీకి గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుంటూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07196) ఈ నెల 24, 30 తేదీల్లో రాత్రి 7.30కి బయలుదేరుతుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. కాకినాడటౌన్–చర్లపల్లి (07195) ఈ నెల 28, 31 తేదీల్లో సాయంత్రం 7.50కి స్టార్ట్ అయ్యి గుంటూరు మీదుగా వెళ్తుంది.
News December 9, 2025
గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.