News May 12, 2024
పల్నాడు: విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News April 17, 2026
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 17, 2026
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
సోలార్ దరఖాస్తుల్లో గుంటూరు జోరు!

పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్ల కోసం గుంటూరులో ఏకంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు ఈ యూనిట్లు ఉచితం. ఇతరులకు కేంద్రం రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. దరఖాస్తుల్లో 30 శాతం వరకు బీసీలవే ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 20 వేల సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీ మార్గదర్శకాల కోసం గుంటూరు లబ్ధిదారులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.


