News January 27, 2025
పల్నాడు శకటానికి ప్రథమ బహుమతి

పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో అంగన్వాడీ కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, బాధిత మహిళలకు అందించే కౌన్సిలింగ్, వైద్య, న్యాయ, దత్తత, సహాయాలను డిపార్ట్మెంట్ అధికారులు శకటంపై దృశ్య రూపంలో ప్రదర్శించారు. ప్రాజెక్టు జిల్లా అధికారి ఆర్.కుమిదిని కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదగా ప్రథమ బహుమతి అందుకున్నారు.
Similar News
News October 30, 2025
జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
News October 30, 2025
నిర్మల్ పట్టణంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం

నిర్మల్ పట్టణంలో గురువారం ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, నిర్మూలన మార్గాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


