News March 21, 2024

పల్నాడు: సజావుగా పదో తరగతి పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. 127 కేంద్రాల్లో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 25,423 మందికి 24,931 మంది హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 60 కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. తాను వినుకొండలో మూడు కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. 

Similar News

News March 16, 2026

GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

image

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.

News March 16, 2026

అమరజీవి త్యాగం.. తెలుగు జాతికి పునాది: మంత్రి సవిత

image

అమరావతిలో 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా  58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. అమరావతిలోని సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందన్నారు.

News March 16, 2026

GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

image

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.