News May 4, 2024
పల్నాడు: సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్
పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ప్రత్యేక సీఆర్పిఎఫ్ బలగాలు అదనంగా ఉంటాయన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.
Similar News
News November 3, 2024
‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్య పోయావా చంద్రబాబు’
‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’.. అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు Xలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా అంబటి ట్వీట్‌తో కూటమి నేతలు మండిపడుతున్నారు.
News November 3, 2024
అమరావతికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఎం
రాజధాని అమరావతికి అప్పు కాదు.. కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు అన్నారు. శనివారం అమరావతి తుళ్లూరులో సీఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చిత పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా, పటిష్ఠంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News November 3, 2024
హంతకులకు కొమ్ము కాస్తున్నారు : అంబటి
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.