News February 21, 2025
పల్నాడు: సీఐని విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

సీఐ శ్రీనివాసరావు తన వద్ద రూ.35 లక్షలు తీసుకొని మోసగించాడని సంతగుడిపాడుకి చెందిన రామారావు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో జీరో ఎఫ్.ఐ.ఆర్‌గా కేసు నమోదు చేశారు. 2021లో సీఐపై సస్పెండ్ వేటు వేశారు. స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీఐ పై ఆరోపణలు వాస్తవమని నిరూపణ కావడంతో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 27, 2025
విశాఖ: అవినీతి పోలీసుల వేటకు రంగం సిద్ధం?

విశాఖలోని పోలీస్ శాఖలో అవినీతిపై సీరియస్ అయిన CP శంఖబ్రత బాగ్చీ భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల నలుగురు SIలను బదిలీ చేసిన ఆయన, నేడు మరో 37 మంది ASIలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లను ఒకేసారి బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది అవినీతి, నెల మామూలు వసూళ్లు, నేరస్తులకు సమాచారం చేరవేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో సీఐలపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
News November 27, 2025
సంగారెడ్డి: వార్డు స్థానాలకు 149 నామినేషన్లు

జిల్లాలోని ఏడు మండలాల్లో వార్డు స్థానాలకు 149 నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ ప్రావీణ్య గురువారం తెలిపారు. సంగారెడ్డి-18, కంది- 38, కొండాపూర్- 39, సదాశివపేట-5, పటాన్ చెరు- 17, గుమ్మడిదల- 3, హత్నూర- 29 నామినేషన్ దాఖలు అయినట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
News November 27, 2025
సంగారెడ్డి: రేపు తనిఖీ బృందం సభ్యులకు శిక్షణ కార్యక్రమం

తనిఖీ బృందాల్లో నియమించబడిన ఉపాధ్యాయులకు ఈనెల 28వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డిలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో శిక్షణ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. తనకి బృందాలకు ఎంపికైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.


