News March 28, 2025
పల్నాడు: సైన్స్ పరీక్షలకు 98.70 శాతం హాజరు

పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు 98.70 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 128 సెంటర్లలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. మొత్తం 25,690 మంది విద్యార్థులకు గాను పరీక్షలకు 25,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 13 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షించారని డీఈవో చెప్పారు.
Similar News
News April 4, 2025
చింతలపూడి: ఆటో బోల్తా.. మహిళా కూలీలకు గాయాలు

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడ్డ ఘటన చింతలపూడిలోని ఆంథోని నగర్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మండలంలోని వెలగలపల్లి వద్ద ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 10మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News April 4, 2025
స్టార్టప్స్‌కు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పనికిరాదు: లింక్డిన్ కోఫౌండర్

లింక్డిన్ కోఫౌండర్ హాఫ్‌మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్ కంపెనీలకు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పనికిరాదన్నారు. ఎవరైనా ఆ మాట చెబితే వారికి స్టార్టప్ గురించి అవగాహన లేనట్లేనని చెప్పారు. అంకుర సంస్థలు సక్సెస్ అవ్వాలంటే ఉద్యోగులు నిరంతరం పనిచేయాల్సిందేనన్నారు. ‘ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో డిన్నర్ చేసి మళ్లీ పని మొదలుపెట్టండి’ అని లింక్డిన్ స్థాపించిన కొత్తలో ఉద్యోగులకు చెప్పేవాళ్లమని వెల్లడించారు.
News April 4, 2025
మహిళపై అత్యాచార యత్నం

మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. తిర్లాపురానికి చెందిన ఓ మహిళ పొలం పనులు చేసుకుని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెంకన్న అనే వ్యక్తి అమె పై అత్యాచారయత్నం చేశాడు. ఎదురుతిరిగిన మహిళ ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.