News September 10, 2024
పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత..!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
Similar News
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
News October 14, 2025
విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.
News October 14, 2025
సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహాల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.