News January 29, 2025
పల్లి రైతుల ఆందోళన కనిలించడం లేదా సీఎం గారూ: కవిత

వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారూ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం శీతకన్నులో వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్నగర్ జిల్లా అట్టుడుకుతోందన్నారు.
Similar News
News November 22, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
HYD: KPHBలో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.


