News October 9, 2024
పల్లెకు మంచి రోజులు
గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా కర్నూలు జిల్లాలో 889, నంద్యాల జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
Similar News
News November 12, 2024
KC కెనాల్ గురించి తెలుసా?
KC కెనాల్ (కర్నూలు-కడప కాలువ) రాయలసీమలోని ఒక ప్రధాన పంట కాలువ. 1950లో నిర్మితమైంది. ఇది పెన్నా, తుంగభద్ర నదులను అనుసంధానిస్తుంది. ఈ కాలువ కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల బ్యారేజీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ కెనాల్ పొడవు 305.60 కి.మీ కాగా దీని కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇది కర్నూలు, కడప జిల్లాల రైతులకు ప్రాణప్రదమైన కాలువ.
News November 12, 2024
కేశవ్ పద్దు.. కేసీ కెనాల్‌కు అధిక నిధులు
➤ ఉమ్మడి కర్నూల్ జిల్లా ప్రాజెక్టులకు రూ.445.81కోట్లు
➤ అధికంగా కేసీ కెనాల్‌కు ₹253.10కోట్లు
☞ ఎల్లెల్సీకి ₹13కోట్లు, గాజులదిన్నెకు ₹11.80కోట్లు
☞ గుండ్రేవుల జలాశయానికి నిధులు నిల్
➤ జిల్లాలో గుంతలు పూడ్చేందుకు ₹15.73కోట్లు
➤ RUకి రూ.10.45కోట్లు, ఉర్దూ వర్సిటీకి రూ.1.5కోట్లు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹346.15 కోట్లు
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ జిల్లాలో సుమారు 4 లక్షల మంది లబ్ధిదారులు
News November 12, 2024
జగన్.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రా: మంత్రి బీసీ
మాజీ సీఎం జగన్‌కు మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోం. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.