News February 21, 2025
పల్లె పండుగ పనులు శత శాతం పూర్తికావాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో పల్లె పండుగ కింద మంజూరైన పనులన్ని శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండుగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్నారు.
Similar News
News November 7, 2025
రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT
News November 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.
News November 7, 2025
నల్గొండలో ర్యాగింగ్పై కలెక్టర్ ఆరా

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.


