News February 25, 2026
పల్వంచ: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ASP

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి ASP చైతన్య రెడ్డి అన్నారు. పల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ సమయంలో స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయించిన సర్పంచ్ నర్సింహారెడ్డి దంపతులను పాలకవర్గాన్ని ఆమె అభినందించారు. ఎస్సై అనిల్, బట్టెంకి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ రిజల్ట్స్.. ఉమ్మడి ADB ర్యాంకులు ఇవే

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మిశ్రమ ఫలితాలను కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ర్యాంకుల్లో ఆసిఫాబాద్ జిల్లా 82.16% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. మరోవైపు నిర్మల్ జిల్లా 73.43% (13వ ర్యాంకు), మంచిర్యాల 71.63% (19వ ర్యాంకు) సాధించగా, ఆదిలాబాద్ జిల్లా 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి పరిమితమైంది.
News April 12, 2026
కొత్తగూడెం: 991 మార్కులు సాధించిన సాత్విక

కొత్తగూడెం టౌన్ హనుమాన్ బస్తీకి చెందిన సాత్విక నేటి ఇంటర్ ఫలితాల్లో 991 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూపులో వైరా ప్రభుత్వ గురుకుల మహిళా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్, రేణుక దంపతుల కుమార్తె సాత్విక అత్యుత్తమ మార్కులు సాధించడంతో కళాశాల ఉపాధ్యాయ, సిబ్బంది, విద్యార్థులు, కొత్తగూడెం పట్టణవాసులు ప్రత్యేకంగా అభినందించారు.
News April 12, 2026
విజయ్ బ్రేకులు.. వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ DMK సెటైర్లు

తమిళనాడు ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో TVK చీఫ్ విజయ్ తన ప్రచార సభలను వరుసగా రద్దు చేసుకోవడంపై DMK విమర్శలు గుప్పించింది. నేతలంతా ప్రజల్లో తిరుగుతుంటే ఆయన మాత్రం బ్రేకులు తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. విజయ్ ఇంకా చాలా జిల్లాలు కవర్ చేయాల్సి ఉండటంతో నేరుగా జనం మధ్యకు వెళ్తేనే ఓట్లు వస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.


