News April 7, 2025
పల్వంచ: తాళం వేసిన ఇంట్లో దొంగతనం

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సాయిలు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి వెళ్లరు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారం పుస్తెల తాడు, రూ.20,000 నగదును దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన భువనగిరి రాజు ఇంటిలో కూడా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్ఐ అనిల్ ఆదివారం చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.
News November 24, 2025
జనగామ: రేపు కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశం

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


