News February 13, 2025
పల్వంచ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ మండలానికి చెందిన కుర్ర వెంకట్(25) అనే యువకుడు 3 నెలల క్రితం చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసె వేసుకున్నాడు. కాగా ప్రమాదవశాత్తు గుడిసెకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్‌తో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఏస్ఐ అనిల్ తెలిపారు.
Similar News
News October 22, 2025
పల్నాడు: రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’

పల్నాడు జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. డ్రైవింగ్‌లో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా నడపాలని డ్రైవర్లకు పోలీసులు సూచించారు. దాచేపల్లి, మాచర్ల, నరసరావుపేట సహా పలు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.
News October 22, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News October 22, 2025
కరీంనగర్: భారత్ నుంచి పాల్గొన్న ఏకైక స్కాలర్

HZB(M) రాంపూర్‌వాసి శ్రీరాములు అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించి మన జిల్లా కీర్తిని చాటారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు మెల్బోర్న్ యూనివర్సిటీ OCT 21- 23 వరకు జరుగుతున్న స్వదేశీ సంస్థాగత అధ్యయనాల అంతర్జాతీయ అకాడమీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు భారత్ నుంచి పాల్గొన్న ఏకైక పరిశోధకలు శ్రీరాములు.